కూటికోసం, కూలికోసం
పట్టణంలో బ్రతుకుదామని-
తల్లి మాటలు చెవిన పెట్టక
బయలుదేరిన బాటసారికి,
మూడురోజులు ఒక్కతీరుగా
నడుస్తున్నా దిక్కుతెలియక -
నడి సముద్రపు నావ రీతిగా
సంచరిస్తూ, సంచలిస్తూ
దిగులు పడుతూ, దీనుడవుతూ
తిరుగుతుంటే -
చండ చండం, తీవ్ర తీవ్రం
జ్వరం కాస్తే,
భయం వేస్తే,
ప్రలాపిస్తే -
మబ్బు పట్టీ, గాలికొట్టీ
వాన వస్తే, వరదవస్తే
చిమ్మ చీకటి క్రమ్ముకొస్తే
దారితప్పిన బాటసారికి
ఎంత కష్టం!
శ్రీ శ్రీ జీవం పోసిన ఈ బాటసారి కథ ఈ నాటికీ ఎన్నో జీవితాల ప్రతిబింబం
సంతోషాన్నీ దుఖ్ఖాన్నీ పంచుకోడానికి తోడు లేకుంటే చాలా కష్టం.
అందరికీ దూరంగా పూలదారి వేటలో నడుస్తూ ఉండడం మహా కష్టం.
దూర తీరాలలో ఒంటరి జీవితం ఎంతో కష్టం...
now how am I supposed to read this :P
ReplyDeleteradha superb. i loved it
ReplyDelete@divya a lot of my blogs are going to be in telugu henceforth..show me u r a true fan...learn the language :-)
ReplyDelete@kirru thanks